గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా… బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
