రకుల్‌ను ఘోరంగా అవమానించిన ప్రభాస్‌.. అసలేమైందంటే?

రకుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ భాషల్లోనూ నటిస్తూ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న ఈ ఢిల్లీ భామ..

`వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడిన రకుల్‌.. ఒక్క ప్రభాస్‌తో మాత్రం నటించలేదు.

అందుకు కారణం ప్రభాస్ చేసిన అవమానమేనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతంలో ప్రభాస్ ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. అయితే ఆ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా దర్శకుడు ఎంపిక చేశాడట. కానీ, ప్రభాస్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా పనికి రాదని, ఆమెకు నటన రాదని, ఆమెను వద్దని చెప్పి తన సినిమాలో నుంచి తీయించేశాడట.

ఈ విషయం తెలుసుకుని ఘోర అవమానంగా ఫీలైన రకుల్.. ఆ తర్వాత ప్రభాస్ సినిమాల నుంచి ఆఫర్ల వచ్చినా రిజెక్ట్ చేసిందట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. సోసల్ మీడియాలో మాత్రం ఒకప్పుడు ఈ వార్త జోరుగా ప్రచారం జరిగింది.

కాగా, ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్‌`, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` చిత్రాలు చేస్తున్నాడు. ఇక రకుల్ విషయానికి వస్తే.. ఈమె ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు బాలీవుడ్ సినిమాలు చేస్తోంది.

About amaravatinews

Check Also

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ నటులు, దర్శక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *