Samantha Oo Antava.. Oo Oo Antava Lyrical Song Out: సమంత.. ఈ పేరు చెప్తేనే కుర్రకారు హుషారెత్తిపోతారు. ఆమె నటనకు, క్యూట్ లుక్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదేమో! తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకున్న సామ్ మొట్టమొదటి సారిగా ఐటం సాంగ్‌లో నటించింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ పుష్పలో ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..’ స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అంటూ సాగిన ఈ సాంగ్ లిరికల్ వీడియో శుక్రవారం సాయంత్రం రిలీజైంది.
