వృద్ధుడు దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు..!

కరాచీ : ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనంతరం అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు గా కోసి ఓ ఫ్లాట్ లో అక్కడక్కడ పడి ఉన్నాయి.

ఈ ఘటన పాకిస్థాన్‌లో కరాచీలో చోటుచేసుకుంది. అయితే అదే ఫ్లాట్ లో పోలీసుల వచ్చే చూసేసరికి ఓ మహిళ గాఢ నిద్రలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది. ఆమెనే అతన్ని హత్య చేసిందని అనుమానిస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని సద్దార్ ప్రాంతంలోని పాత అపార్ట్‌మెంట్ భవనంలో ఒక ఫ్లాట్ దగ్గర మనిషి చేతి భాగాలు పడి ఉన్నాయి. అది చూసిన ఒకరు.. పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓ ఫ్లాట్‌ తలుపులు బలవంతంగా తెరిచి చూడగా.. ఆ ఫ్లాట్ లో ఓ వృద్ధుడి మృతదేహం శరీర భాగాలు అక్కడక్కడ కనిపించాయి. అదే ఫ్లాట్ లో ఓ 45 ఏండ్ల మహిళ గాఢనిద్రలో ఉంది. రక్తంతో తడిసిన బట్టలు, మృతదేహాన్ని ముక్కులు చేయడానికి ఉపయోగించిన ఆయుధం సహా పలు ఆధారాలు లభించడంతో ఆ మహిళను అరెస్టు చేశారు.
అయితే, నిందితురాలు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. తొలుత మృతుడు నా భర్త మహ్మద్ సొహెయిల్ అని చెప్పి.. ఆ తర్వాత తాము పెండ్లి చేసుకోలేదని చెబుతోందని తెలిసింది. మత్తులో ఉన్న ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. స్థానికులు మాత్రం ఇరువురూ సహజీవనం చేస్తున్నట్టు చెప్పారు. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయని అన్నారు.

About amaravatinews

Check Also

వీడియో కాల్స్‌ చేయ్‌, లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తానంటూ

హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *