హన్మకొండలో బైక్ ను ఢీకొన్న కారు

హైదరాబాద్ : హన్మకొండ జిల్లా బాలసముద్రంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

బస్టాండ్ నుంచి సుబేదారి వైపు వెళ్తున్న ఓ కారు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దాంతో ద్విచక్రవాహనంపై వెళ్తోన్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

About amaravatinews

Check Also

వీడియో కాల్స్‌ చేయ్‌, లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తానంటూ

హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *