Sirivennela Seetharama Sastry అస్తమయం: మాదిక ఏకాకి జీవితం,కన్నీటి నివాళులు

సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్తలో  యావత్‌ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ప్రముఖ నటుడు  ప్రకాశ్‌ రాజ్‌, మాదిక ఏకాకి జీవితం అంటూ సంతాపం ప్రకటించారు.  ప్రముఖ  దర్శకులు దేవ కట్టా,  అనిల్‌ రావిపూడి  ‘‘మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? ఆయన ఆత్మకి శాంతి చేకూరాలంటూ ట్వీట్‌ చేశారు.

ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్‌  సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.

‘పదం ఆయన ఆస్తి…
జ్ఞానంతో ఆయనకు దోస్తీ
ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి
సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ  మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు.

“మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు” – మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

About amaravatinews

Check Also

వీడియో కాల్స్‌ చేయ్‌, లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలను షేర్‌ చేస్తానంటూ

హైదరాబాద్‌: నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ సృష్టించి దాని ద్వారా ఓ యువతికి, ఆమె తల్లికి అసభ్యకరమైన సందేశాలు, వీడియోలను పంపిస్తూ వేధిస్తున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *