ఆంధ్రప్రదేశ్

నేటి పంచాంగం

వారం: శుక్రవారం తిథి: నవమి మ.1:12 వరకు తదుపరి దశమి నక్షత్రం: చిత్త ఉ.8:03 వరకు తదుపరి స్వాతి శుభసమయం: సా.4.40 నుంచి సా.6.00 వరకు దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి ఉ.9:12 వరకు పునః మ.12:24 నుంచి మ.1:12 వరకు రాహుకాలం: ఉ.10:30 నుంచి మ.12:00 వరకు యమగండం: మ.03:00 నుంచి సా.4:30 వరకు కరణం: కౌలవ ప.1:06 యోగం: సిద్ధం తె.3:43 వరకు తదుపరి సాధ్యం సూర్యోదయం: ఉ.5:36 …

Read More »

ఏపీలో నేటి వాతావరణ సమాచారం

ఏపీలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం జార్ఖండ్ పరిసరాల్లో కేంద్రీకృతం అయిందని తెలిపింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వచ్చే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అరేబియా సముద్రం మీదుగా దేశంలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని …

Read More »

నేటి రాశిఫలాలు

మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. …

Read More »

ఏపీలో ముగిసిన మోదీ పర్యటన

అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ  పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు  125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకలో పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య …

Read More »

అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి….అవమానం

అమరావతి: అల్లూరి సీతారామరాజు (Alluri sitarama raju)విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ నుంచి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు (Achennaidu) హాజరయ్యారు. అచ్చెన్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) ఫోన్ చేసి హెలిప్యాడ్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. అయితే తనకు వచ్చిన లిస్టులో అచ్చెన్న పేరు లేదని జిల్లా కలెక్టర్ …

Read More »

సీఐ సహా ముగ్గురు ఎస్‌ఐల సస్పెన్షన్‌

సిగరెట్లు అమ్ముకున్న అధికారులపై వేటు ఉత్తర్వులు జారీ చేసిన అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌ తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్‌ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్‌ఐలను సస్పెండ్‌ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.   తిరుచానూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని …

Read More »

ఎస్సీ మహిళలకు బస్‌ డ్రైవింగ్‌లో శిక్షణ

మంత్రి మేరుగ నాగార్జున అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శిక్షణ అనంతరం వారికి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల సౌజన్యంతో నర్సింగ్‌ కోర్సుల్లో కూడా శిక్షణ …

Read More »

నేడే పీఎస్‌ఎల్‌వీ సీ53 ప్రయోగం

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్‌ బుధవారం మొదలైంది. సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ–53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 …

Read More »

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,154 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,182 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.62 కోట్లు వేశారు. ఎటువంటి టోకెన్‌లు లేకపోయినా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి. స్వామిని దర్శించుకున్న సినీ నటి రాశీ ఖన్నాతిరుమల శ్రీవారిని బుధవారం సినీ …

Read More »

గుంటూరులో దారి దోపిడీ ముఠా అరెస్ట్

గుంటూరు: జిల్లాలోని చిలకలూరుపేట నియోజవర్గంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు జంటలపై దాడి చేసిన ముఠా… బంగారు ఆభరణాలు, డబ్బులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా సభ్యులను పోలీసులు ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Read More »
  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/