అమరావతి: ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. గన్నవరం నుంచి ఆయన ఢిల్లీ బయల్దేరారు. తెలుగుఖ్యాతి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకలో పాల్గొన్నారు. క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని అక్కడ నుంచే వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. అక్కడి నుంచి భీమవరం వెళ్లారు.
