మహమ్మారి నుండి బయటపడేందుకు ఏ దేశం తగిన ప్రయత్నం చేయలేదు : టెడ్రోస్‌ అథనామ్‌

సంపన్న దేశాలు అదనపు కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు పట్ల హడావుడి చేయడం ద్వారా టీకాల వినియోగంలో అసమానతలు మరింత దిగజారి, మహమ్మారి సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనమ్‌ గెబ్రాయసిస్‌ హెచ్చరించారు.

వ్యాక్సిన్లు తీసుకున్న వారికి అదనపు డోసులు ఇవ్వడం కన్నా.. ప్రమాదం అధికంగా ఉండే వ్యక్తులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత చూపించాలని అన్నారు. మహమ్మారి నుండి బయట పడేందుకు ఏ ఒక్క దేశం ప్రయత్నించలేదని విమర్శించారు. కాగా, చాలా కాలంగా వ్యాక్సిన్ల విషయంలో నెలకొన్న అసమానతలను టెడ్రోస్‌ ఖండిస్తూనే ఉన్నారు.

కొన్ని ప్రాంతాల్లో కోవిడ్‌ వ్యాప్తి చేసేందుకు అనుమతించడం వల్ల కొత్త, మరింత ప్రమాదకరమైన వైరస్‌లు సృష్టించేందుకు కారకులౌతున్నారని డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొంది. బూస్టర్‌ డోసుల నిమిత్తం.. అధిక స్థాయిలో టీకాలు అందించిన దేశాలకు వ్యాక్సిన్లను మళ్లించడం ద్వారా మహమ్మారిని అంతం చేయడానికి బదులు.. పొడిగించడానికి అవకాశం ఇచ్చినట్లయిందని టెడ్రోస్‌ అన్నారు. దీని వల్ల వైరస్‌ వ్యాప్తికి, కొత్త వేరియంట్‌ సృష్టికి కారకులౌతున్నామని హెచ్చరించారు

About amaravatinews

Check Also

ట్రెయినీ పైలట్ అనూహ్య మరణం..! దోమ కుట్టడంతో..

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌కు చెందిన ఓ మహిళా ట్రెయినీ(Trainee pilot) పైలట్ దోమ కుట్టడం వల్ల అనూహ్యంగా మరణించింది. దోమకాటు(Mosquito bite) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

  • https://josefinohrn.com/
  • https://huzlers.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/